మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : గురువారం, 13 జులై 2017 (11:40 IST)

ఒత్తిడిని దూరంచేసే యాలకులు.. జలుబు, దగ్గు తగ్గాలంటే?

యాలకుల్లో మెగ్నిషియం, క్యాల్షియంలతోపాటు కావలసినంత ఎలక్ట్రోలైట్లు వుంటాయి. ఇందులో పొటాషియం గుండె కొట్టుకునే వేగాన్ని క్రమబద్ధీకరిస్తుంది. తద్వారా అధికరక్తపోటు అదుపులో వుంటుంది. యాలకులని నమలడం వల్ల నోటి

యాలకుల్లో మెగ్నిషియం, క్యాల్షియంలతోపాటు కావలసినంత ఎలక్ట్రోలైట్లు వుంటాయి. ఇందులో పొటాషియం గుండె కొట్టుకునే వేగాన్ని క్రమబద్ధీకరిస్తుంది. తద్వారా అధికరక్తపోటు అదుపులో వుంటుంది. యాలకులని నమలడం వల్ల నోటిదుర్వాసన సమస్య అదుపులో ఉంటుంది. చిగుళ్ల సమస్యలు కూడా చాలామటుకూ తగ్గుతాయి. యాలకులతో చేసిన నూనెని పెదాలకు రాయడం వల్ల ఆరోగ్యంగా కనిపిస్తాయి. అలాగే ముఖానికి రాస్తే ఛాయ పెరుగుతుంది.
 
యాలకులు ఆకలిని పెంచుతాయి. ప్రతిరోజూ పడుకునే ముందు గ్లాసు గోరువెచ్చటి పాలల్లో అరచెంచా యాలకులపొడీ, పసుపూ, చక్కెరా వేసుకుని తాగడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. దగ్గు, జలుబు తగ్గించడంలో యాలకులు పవర్ ఫుల్‌‌గా పనిచేస్తాయి. అలాంటి సమయంలో యాలకులు తింటూ ఉంటే.. జలుబు, దగ్గు తగ్గడమే కాకుండా.. గొంతులో ఇన్ఫెక్షన్లను కూడా దూరం చేస్తుంది. యాలకులు ఒత్తిడిని తగ్గిస్తాయి. 
 
యాలకులు వేసి మరిగించిన టీ తీసుకోవడం వల్ల వెంటనే ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. యాలకులు తినడం వల్ల ఊపిరితిత్తుల్లో రక్తప్రసరణ మెరుగవుతుంది. తద్వారా ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.