శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : గురువారం, 29 జనవరి 2015 (16:07 IST)

జీలకర్రతో వృద్ధాప్య ఛాయలు, ఎసిడిటీకి చెక్!

జీలకర్రను వాడండి.. వృద్ధాప్య ఛాయలకు చెక్ పెట్టండి! అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. జీలకర్ర వృద్ధాప్య ఛాయలు ఏర్పడకుండా నివారిస్తుంది. వయస్సు కనబడనియ్యకుండా, ముఖంలో ముడుతలు ఏర్పడకుండా నివారిస్తుంది.
 
జీలకర్ర ఎసిడిటిని తగ్గిస్తుంది. సాధారణంగా భోజనం తర్వాత మన దేశంలో చాలామంది జీలకర్రను ఎంతో కొంత మొత్తంలో నోటిలో వేసుకొని చప్పరించటం చూస్తూ వుంటాం. తిన్న పదార్ధాలకు జీర్ణక్రియ బాగా జరగాలంటే, అజీర్ణం వంటివి ఏర్పడకుండా వుండాలంటే, ఈ జీలకర్ర తినటం ఎంతో మేలు చేస్తుంది. పొట్టనొప్పి, అజీర్ణం, డయోరియా, వాంతి వికారం, మార్నింగ్ సిక్ నెస్ వంటి అనారోగ్యాలకు జీలకర్రను బాగా వేయించి కొద్దిగా ఉప్పు కలిపి తినటం చేస్తారు.
 
రెగ్యులర్ డైట్‌లో జీలకర్రపొడి చేర్చుకోవడం వల్ల రక్తంను శుభ్రపరుస్తుంది. జీలకర్రను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లను నివారించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.