శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : గురువారం, 18 సెప్టెంబరు 2014 (14:26 IST)

కాకర కాయ చేదంటే.. అనారోగ్యం పాలైనట్లే?

అమ్మో కాకర కాయ చేదు అనుకుంటున్నారా? అయితే అనారోగ్యం పాలైనట్లే. కాకరలో తల నుంచి పాదాల వరకు మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారంలో అప్పుడప్పుడు కాకరను చేర్చుకోవడం ద్వారా అలెర్జీ, ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్ వంటివి దరిచేరవు. 
 
కాకరలో కెలోరీలు తక్కువ. ఇందులో 80 శాతం నుంచి 90 శాతం వరకు తేమ ఉంటుంది. బి1, బి2, బి3, బి5, బి6, సి విటమిన్లతో పాటు పొటాషియం, మేగ్నీషియం, సోడియం, ఫాస్పరస్ వంటి ధాతువులు వున్నాయి. ఆకుకూరల్లో ఉన్న క్యాల్షియం కంటే కాకరలో రెండింతలు అధికంగా క్యాల్షియం ఉంటుంది. 
 
100 గ్రాముల కాకరలో ఏముంది?
కొవ్వు - 0.17 గ్రాములు, 
పీచు- 2.80 గ్రాములు 
నియాసిన్ - 0.400 మి.గ్రాములు 
క్యాల్షియం - 10. మి.గ్రాములు 
సోడియం - 5 మి. గ్రాములు 
పొటాషియం -296 మి.గ్రా 
 
ఇకపోతే కాకర పేగు సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. నెలసరిని క్రమం చేయడంతో పాటు బరువు నియంత్రిస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్‌తో పాటు శరీరంలో క్యాన్సర్ కణాలను దరిచేరనీయకుండా చేస్తుంది.     
 
అయితే కాకరను అతిగా తినకూడదని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాకరను నెలకు మూడుసార్లో వారానికి ఒకసారో మాత్రమే తీసుకోవాలి. ఇంకా గర్భిణీ మహిళలు, పిల్లలకు పాలుపట్టే మహిళలు కాకరను మితంగానే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.