గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2016 (16:50 IST)

రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించే నువ్వుల నూనె.. వారానికోసారి తలంటుస్నానం చేస్తే?

నువ్వుల నూనె చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది. చర్మాన్ని మృదువుగా కోమలంగా ఉంచుతుంది. శరీరానికి తేమనిస్తుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వారానికి శనివారం పూట నువ్

నువ్వుల నూనె చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది. చర్మాన్ని మృదువుగా కోమలంగా ఉంచుతుంది. శరీరానికి తేమనిస్తుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వారానికి శనివారం పూట నువ్వులనూనెతో అభ్యంగన స్నానం చేయడం.. నరాల బలహీనతకు చెక్ పెడుతుంది. కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది. 
 
వారానికోసారి నువ్వుల నూనెతో మర్దన చేసుకుని తలస్నానం చేయడం ద్వారా జుట్టు బాగా పెరుగుతుంది. చుండ్రు తొలగిపోతుంది. ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. నువ్వులనూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం ద్వారా యాంటీ యాక్సిడెంట్‌గా ఇది పనిచేస్తుంది. 
 
ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించి హైబీపీని నియంత్రిస్తుంది. నువ్వుల నూనెలోని పోషకాలు ఎముకలను బలపరుస్తాయి. నువ్వుల నూనెలో క్యాల్షియం, మెగ్నీషియం వంటి ధాతువులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి.