శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2016 (13:46 IST)

మందార రేకుల పొడిని మజ్జిగతో కలిపి తీసుకుంటే..?

మందార పువ్వులు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. అయితే మందార పువ్వు ఆరోగ్యానికి మేలు చేసే పలు ఔషధ గుణాలు కలిగివుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మందార ఆకు, పువ్వులు, వేర్లల్లో ఔషధ గుణాలెన

మందార పువ్వులు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. అయితే మందార పువ్వు ఆరోగ్యానికి మేలు చేసే పలు ఔషధ గుణాలు కలిగివుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మందార ఆకు, పువ్వులు, వేర్లల్లో ఔషధ గుణాలెన్నో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా మందార పువ్వులు మహిళల గర్భసంచికి ఎంతో మేలు చేస్తాయి. గర్భసంచి సమస్యలు, వయసు మీద పడినా మహిళలు ఎదుర్కొనే నెలసరి సమస్యలకు మందార పూ రేకులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. 
 
మందార పూ రేకులను పేస్ట్ చేసుకుని మజ్జిగలో కలిపి రోజూ తీసుకుంటే.. మహిళల్లో గర్భసంచి సమస్యలు దూరమవుతాయి. ఇంకా నెలసరి సమస్యలు మటుమాయమవుతాయి. మందార పువ్వుల్ని నీడలో ఎండబెట్టి.. పొడి చేసుకుని కషాయంలా తీసుకుంటే.. నెలసరి సమయంలో ఏర్పడే పొత్తికడుపు నొప్పి, తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. 
 
హృద్రోగ వ్యాధిగ్రస్థులు మందార పూవు రేకులు, తెలుగు తామర పువ్వుకు చెందిన రేకుల్ని కషాయంలా సేవిస్తే.. గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో గల మలినాలను తొలగిస్తుంది. ఇంకా అజీర్ణానికి చెక్ పెట్టాలంటే.. నోటిపూతను దూరం చేసుకోవాలంటే.. రోజూ ఐదు లేదా పది మందారపువ్వుల్ని తీసుకోవడం ఉత్తమం. ఇంకా మందార పువ్వు పొడిని మాడుకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే.. చుండ్రుకు చెక్ పెట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.