Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చేపనూనెతో తేనెను కలుపుకుని తీసుకుంటే?

సోమవారం, 12 మార్చి 2018 (09:21 IST)

Widgets Magazine

చేపనూనెతో తేనెను కలుపుకుని తీసుకుంటే.. చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తేనెను పరగడుపున వేడినీటితో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు. నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే వేవిళ్లు, జలుబు తగ్గుతుంది. అదేవిధంగా తేనెతో ఉల్లిపాయల రసాన్ని కలిపి తీసుకుంటే కంటి దృష్టి మెరుగుపడుతుంది.
 
ఇక జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందాలంటే, శ్వాసకోశ వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. బార్లీ గంజిని తయారు చేసుకుని దానిని వడగట్టి.. అందులో తేనె కలిపి తీసుకోవాలి. తేనెను దానిమ్మ రసంతో కలుపుకుని రోజూ తీసుకుంటే.. గుండెపోటు సమస్యలు దరిచేరవు. జీలకర్రను నీటిలో బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి.. అందులో తేనె కలుపుకుని తాగితే మోకాళ్ల నొప్పిని దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఖనిజలవణాలు, థైమీన్, రిబోఫ్లావిన్, పైరిడాక్సిన్, పాంటోథెనిక్ యాసిడ్, నికోటెనిక్ యాసిడ్… లాంటి విటమిన్లు వున్నాయి. ఊబకాయులు పరగడుపున రెండు టీస్పూన్ల నిమ్మరసంలో అరచెంచా తేనెను కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 
 
ఫ్లేవోనాయిడ్లు, టెర్పీన్లు, పాలీఫినాల్లు అనే ఔషధగుణాలు.. అనేక రకాల అల్సర్లను తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, క్యాన్సర్, హృద్రోగాల్ని అడ్డుకుంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

అధిక బరువును ఎలా తగ్గించుకోవచ్చో తెలుసా?

ప్రస్తుత కాలంలో ఎక్కువుగా ఉన్న సమస్య అధిక బరువు. ఈ అధిక బరువు సమస్య వల్ల అనేక రకాలైన ...

news

వేసవిలో కీరదోసకాయను రోజూ తినండి.. లేకుంటే?

వేసవి కాలం వచ్చేసింది.. ఎండలు మార్చిలోనే మండిపోతున్నాయి. వేసవిలో వడదెబ్బ తగలకుండా ...

news

కొత్తగా పెళ్లయిన జంటల్లో శృంగారం పట్ల భయం... కానీ...

కొత్తగా పెళ్లయిన జంట శృంగారం విషయంలో ఎన్నో కలలు కంటారు. ముఖ్యంగా మగవారు తమ భార్యను ...

news

బరువు తగ్గాలా? కొబ్బరినూనెను వంటల్లో వాడండి.. మరి డిమాండ్?

కొబ్బరి నూనెను వంటల్లో వాడటం ద్వారా బరువు సులభంగా తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు ...

Widgets Magazine