శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2016 (18:47 IST)

ఆవనూనెతో కొవ్వు తగ్గించుకోండి.. పొట్టకు రాసుకుంటే.. తగ్గుతుందట..

బరువు తగ్గాలని.. జిమ్‌లు, వాకింగ్‌లు వంటివి ఏవేవో చేసేస్తున్నారా? అయితే ఈ చిట్కా పాటించండి. ఆవనూనెను కాస్త వేడెక్కించండి. హీట్ అయిన ఆవనూనెలో మెత్తటి కర్పూరం వేసి అది కరిగేదాకా ఉంచాలి. కలిగిన వెంటనే దా

బరువు తగ్గాలని.. జిమ్‌లు, వాకింగ్‌లు వంటివి ఏవేవో చేసేస్తున్నారా? అయితే ఈ చిట్కా పాటించండి. ఆవనూనెను కాస్త వేడెక్కించండి. హీట్ అయిన ఆవనూనెలో మెత్తటి కర్పూరం వేసి అది కరిగేదాకా ఉంచాలి. కలిగిన వెంటనే దానిని బాటిల్‌లో భద్రపరుచుకోవాలి. 
 
పొట్ట తగ్గాలనుకున్నప్పుడు లేదా కొవ్వు తగ్గాలనుకున్నప్పుడు.. మనం తయారు చేసుకున్న నూనెను కావాల్సినంత తీసుకుని దానిని గోరువెచ్చగా కాసింత వేడి చేసి.. శరీరంలో కొవ్వు అధికంగా ఉన్న చోట దాన్ని రాసుకోవాలి. దాని తర్వాత కుడి నుంచి ముందుకు ఎడమ నుంచి కుడికి తిరుగుతూ 15 నిముషాలు మసాజ్ చేసుకోవాలి. ఇలా నూనె రాసుకున్న 45 నిమిషాల తర్వాత వేడి నీటితో స్నానం చేయాలి. 
 
ఇలా చేసిన మూడో రోజు నుంచి కొవ్వు కరగడం మొదలవుతుందని ఇలా ప్రతిరోజూ లేదా వారానికి రెండుసార్లు చేస్తే కొవ్వు తగ్గడం ద్వారా బరువు కూడా తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.