శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (17:01 IST)

సహజసిద్ధమైన క్లెన్సింగ్ ఏజెంట్‌లా పనిచేసే బెల్లం!

బెల్లం క్లెన్సింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. తియ్య తియ్యని బెల్లాన్ని తగు మోతాదులో తినడం వల్ల ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది సహజసిద్ధమైన క్లెన్సింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుందని వారు చెబుతున్నారు. 
 
బెల్లం శరీరంలోని శ్వాసకోస గ్రంథులూ, ఊపిరితిత్తులూ, పొట్ట వంటి వాటిని శుభ్రపరుస్తుంది. శరీరంలో వివిధ రకాల ఎంజైములను ఎసిటిక్ యాసిడ్‌గా మార్చి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. 
 
ఆయుర్వేదంలో పొడిదగ్గూ, జలుబూ, ఆస్తమా వంటి సమస్యలకు వాడే మందుల్లో బెల్లం ఓ పదార్థంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల కండరాలకు శక్తి అందుతుంది. తద్వారా జలుబు వంటి రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది. బెల్లంలోని అధిక మోతాదు మెగ్నీషియం రక్తనాళాలు, నరాల పనితీరును మెరుగుపరుస్తాయి.
 
బెల్లంలో ఐరన్ ఉండటం వల్ల రక్తహీనత నుంచి కాపాడుతుంది. ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు శరీరం అలసటకు గురవకుండా తక్షణ శక్తిని అందిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేసి కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. శరీరంలో హానికర వ్యర్థాలను తొలగిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.