మంగళవారం, 19 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By chj
Last Modified: శనివారం, 10 మార్చి 2018 (17:24 IST)

కొత్తగా పెళ్లయిన జంటల్లో శృంగారం పట్ల భయం... కానీ...

కొత్తగా పెళ్లయిన జంట శృంగారం విషయంలో ఎన్నో కలలు కంటారు. ముఖ్యంగా మగవారు తమ భార్యను శృంగారంలో సుఖ పెట్టాలని అనుకుంటారు. అయితే శృంగారం పట్ల కనీస అవగాహన లేనివారు లైంగికంగా ఎలా పాల్గొనాలన్న విషయంలో చాలా భయపడుతూ ఉంటారు. మరికొందరిలో ఇలాంటి వాటితో సంబంధం లే

కొత్తగా పెళ్లయిన జంట శృంగారం విషయంలో ఎన్నో కలలు కంటారు. ముఖ్యంగా మగవారు తమ భార్యను శృంగారంలో సుఖ పెట్టాలని అనుకుంటారు. అయితే శృంగారం పట్ల కనీస అవగాహన లేనివారు లైంగికంగా ఎలా పాల్గొనాలన్న విషయంలో చాలా భయపడుతూ ఉంటారు. మరికొందరిలో ఇలాంటి వాటితో సంబంధం లేకుండా లైంగిక సామర్థ్యం లేకుండా వుంటారు. ఇలాంటివాటివల్ల శృంగారంలో పాల్గొనేటపుడు ఆ సామర్థ్యం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యను ఎవరికి చెప్పలేక వారిలో వారే సతమతమవుతూ శృంగార జీవితాన్ని తృప్తిగా అనుభవించలేకపోతుంటారు. దీనివల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. వీటిని అధిగమించి హాయిగా గడపాలంటే...
 
1. ముందుగా శృంగారంలో పాల్గొనేందుకు మానసికంగా ఇద్దరూ సిద్ధమవ్వాలి. ప్రకృతి మనకు దివ్యమైన ఔషధాలు ఎన్నో ఇచ్చింది. వాటిలో అతి శ్రేష్టమైనవి పెద్దదోలగొండి గింజలు. ఇవి లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో అమోఘంగా పని చేస్తాయి. ఇవి ఆయుర్వేదం షాపులలో దొరుకుతాయి. ఇవి తెలుపు, నలుపు రంగులలో వుంటాయి. వీటిలో ఏరకమైనవైనా వాడుకోవచ్చు.
 
2. పెద్ద దోలగొండి గింజలను ముందుగా కాస్త వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి. దానితోపాటు పటికబెల్లం కూడా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ గింజల పొడి 3 గ్రాములు, పటిక బెల్లం పొడి 3 గ్రాములు తీసుకొని బాగా కలుపుకోవాలి. దీనిని రాత్రి భోజనం చేసిన గంట తర్వాత పడుకునే ముందు స్వచ్ఛమైన గ్లాసుడు ఆవుపాలు కాని, గేదెపాలు కాని గోరువెచ్చగా కాచి వాటిలో ఈ పొడిని కలుపుకొని తాగాలి.
 
ఇలా సుమారు 20 రోజుల పాటు తీసుకోవటం వల్ల మగవారిలో సెక్స్ సామర్థ్యం బాగా పెరుగుతుందని ఆయుర్వేదం చెపుతోంది.