బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : బుధవారం, 20 మే 2015 (17:04 IST)

సంపంగి తైలంతో తలనొప్పికి చెక్: ఆయుర్వేద చిట్కాలివిగోండి!

పువ్వుల్లో సంపంగిలకు ప్రత్యేక స్థానముంది. అరకేజీ కొబ్బరి నూనెలో, 50 గ్రాముల సంపంగి పువ్వులను చేర్చి బాగా మరిగించి దించేయాలి. ఈ నూనెను సంపంగి తైలమంటారు. ఈ తైలాన్ని తల నుంచి పాదాల వరకు రాసుకుని మర్దన చేసుకుంది. ఒంటి నొప్పులు తొలగిపోతాయి. అలాగే వంద గ్రాముల సంపంగి పువ్వులు, 20 గ్రాముల పెసరపప్పు చేర్చి పౌడర్‌లా చేసుకుని.. స్నానం చేసేటప్పుడు ఈ పౌడర్‌ను ఉపయోగిస్తే చర్మం ప్రకాశవంతమవుతుంది.  
 
నాలుగు సంపంగి పువ్వులతో ఒక సటీ స్పూన్ ఆలివ్ ఆయిల్ చేర్చి పేస్ట్‌లా చేర్చి తట్టుకునే మేర తలకు పట్టిస్తే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒక గ్లాసుడు నీటిలో 5 సంపంగి పువ్వుల్ని వేసి.. సగానికి మరిగించి ఆ నీటిని ఉదయం, సాయంత్రం పూట తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి. సంపంగి పువ్వుల్లో కాసింత నీటిని చేర్చి రుబ్బుకోవాలి. కంటి చుట్టూ పూతలా వేసుకుని కాసేపయ్యాక కడిగేసుకోవాలి. ఇలా చేస్తే కంటికి చల్లదనం లభిస్తుంది. 
 
కాచిన పాలలో రెండు సంపంగి పువ్వుల్ని వేసి ఆరనివ్వాలి. ఇందులో చక్కెర లేదా బెల్లం చేర్చి ఒక గ్లాసుడు మోతాదులో 48 రోజులు తీసుకుంటే శరీరానికి బలం చేకూరుతుంది. 200 గ్రాముల నువ్వుల నూనెకు 50 గ్రాముల సంపంగి పువ్వుల్ని చేర్చి మరిగించి.. ఆ నూనెను పాదాలకు పట్టిస్తే పగుళ్ళను దూరం చేసుకోవచ్చు.

పిడికెడు సంపంగి పువ్వుల్ని మరిగే నీటిలో వేచి వారానికి రెండు సార్లు ఆవిరిపడితే చర్మ కాంతి పెరుగుతుంది. మచ్చలు, మొటిమలకు చెక్ పెట్టుకోవచ్చు. రెండు సంపంగి పువ్వులు, కొబ్బరి పాలు రెండు టేబుల్ స్పూన్లు కలిపి బాగా రుబ్బుకుని ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.