గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2017 (13:36 IST)

వేపాకు.. గుడ్డు తెల్లసొన మిశ్రమాన్ని తలకు పట్టిస్తే?

వేపచెట్టు సర్వరోగ నివారిణి. వేపాకు ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మ సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. వేపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు పలురకాల చర్మ అలర్జీలకు, ఇన్‌ఫెక్షన్లకు, మొటిమలకు మంచి

వేపచెట్టు సర్వరోగ నివారిణి. వేపాకు ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మ సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. వేపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు పలురకాల చర్మ అలర్జీలకు, ఇన్‌ఫెక్షన్లకు, మొటిమలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. వేపాకు పేస్ట్‌ను వాడటం ద్వారా ముఖం మీది మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. 
 
వేపనూనెతో వారానికి రెండుసార్లు తలకి మసాజ్‌ చేస్తే జుట్టు రాలడం, చుండ్రు లాంటి సమస్యలు తగ్గుతాయి. ఒక బౌల్‌లో వేపాకు ముద్దని తీసుకుని అందులో గుడ్డు తెల్లసొన వేసి మిశ్రమంగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టిస్తే.. జుట్టు సమస్యలు తొలగిపోతాయి. హెయిర్ ఫాల్‌ను నియంత్రించుకోవచ్చు. 
 
జుట్టు నిర్జీవంగా ఉంటే వేపాకును దంచి ఆ పేస్ట్‌ని తలకి పట్టించి 20నిమిషాల తర్వాత స్నానం చేస్తే జుట్టు మెరుస్తుంది. తలలో ఎక్కువగా దురద పెడుతుంటే వేపాకులు నానపెట్టిన నీళ్లతో తలను శుభ్రపరిస్తే చక్కటి గుణం కనిపిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.