గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : బుధవారం, 31 డిశెంబరు 2014 (17:57 IST)

ఒవేరియన్ క్యాన్సర్‌ను దూరం చేసుకోవాలా?

ఒవేరియన్ క్యాన్సర్‌ను దూరం చేసుకోవాలా? అయితే ఈ ఫుడ్ తీసుకోండి. ఒవేరియన్ క్యాన్సర్‌ను ఎదుర్కొనడంలో విటమిన్ డి గొప్పగా సహాయపడుతుంది. అందుచేత సూర్యరశ్మితో పాటు కోడిగుడ్లను రోజుకొకటి లెక్కన తీసుకోవాలి. శరీరంలో విటమిన్ డి తగ్గితే, ఒవేరియన్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది అందుచేత విటమిన్ డి పుష్కలంగా ఉండే గుడ్డును తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అలాగే ఆకుకూరలు, బ్రొకోలీ కూడా ఒవేరియన్ క్యాన్సర్‌ను దూరం చేస్తాయి. ఆకుకూరల్లో జింక్, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి వ్యాధినిరోధకతను పెంచుతాయి. ఇంకా క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తాయి . క్యాన్సర్‌ను నివారించడంలో ఆకుకూరలు ఉత్తమంగా పనిచేస్తాయి. 
 
అలాగే అల్లంలోని ఔషధ గుణాలు క్యాన్సర్ నివారణకు ఎంతగానో మేలు చేస్తాయి. అల్లం క్యాన్సర్ సెల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. ఒవేరియన్ క్యాన్సర్‌ను రాకుండా చేస్తుంది.
 
ఇకపోతే.. ఒవేరియన్ క్యాన్సర్ నిరోధకతకు ఏ టీ అయినా ఔషధంగా పనిచేస్తుంది. టీ త్రాగడం వల్ల 50 శాతం వరకూ క్యాన్సర్ సోకకుండా దూరం చేస్తుంది. రోజుకు రెండు కప్పుల టీ త్రాగడం వల్ల ఒవేరియన్ క్యాన్సర్ రిస్క్‌ను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.