శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By ttdj
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2016 (21:39 IST)

40 సంవత్సరాలు పైబడిన పురుషులు శనగ పిండి వాడితే...

40 సంవత్సరాలు దాటిన కొందరు పురుషులు శీఘ్ర స్కలనమౌతుందని బాధపడుతుంటారు. అలాంటి వారు రెండు చెంచాల శెనగ పిండిలో కొంచెం ఖర్చూరం, పాలపిండి కలిపి ప్రతి రోజూ రెండుపూటలా తీసుకుంటే శీఘ్ర స్కలనం హరించడమే కాకుండ

40 సంవత్సరాలు దాటిన కొందరు పురుషులు శీఘ్ర స్కలనమౌతుందని బాధపడుతుంటారు. అలాంటి వారు రెండు చెంచాల శెనగ పిండిలో కొంచెం ఖర్చూరం, పాలపిండి కలిపి ప్రతి రోజూ రెండుపూటలా తీసుకుంటే శీఘ్ర స్కలనం హరించడమే కాకుండా బలం కూడా వస్తుంది. 
 
సాధారణంగా మనం స్నానం షాంపుతో చేస్తుంటాం. కొన్ని షాంపుల కారణంగా వెంట్రుకలు ఊడిపోతుంటాయి. అయితే వెంట్రుకలు బాగా పెరగడానికి శెనగపిండి ఎంతో మంచిదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్ లేకుండా వెంట్రుకలు నిగనిగలాడాలంటే ఒక్క శెనగపిండే మార్గమని చెబుతున్నారు. 
 
షాంపుకు బదులు ప్రతిసారీ శెనగపిండితో తలను రుద్ది స్నానం చేస్తే వెంట్రుకలు పెరుగుతాయి. అంతేకాదు శిరోజాలు పట్టుకుచ్చువలె కాంతివంతమై కుదుళ్లు కూడా గట్టిబడును. మూత్రవ్యాధులు గలవారు శెనగల వాడకం తగ్గించుట మంచిది.
 
శనగలో చలువచేసే గుణాలున్నాయి. ఇవి రక్తదోషములను పోగొట్టి బలమును కలిగిస్తాయి. శనగలు సులభంగా జీర్ణమవుతుంది. శనగాకు ఆహారంగా వాడితే పిత్తరోగములు (వేడి జబ్బులు) నశిస్తాయి. అలాగే చిగుళ్ల వాపును తగ్గిస్తాయి. 
 
గజ్జి, చిడుము, తామర కలవారు ప్రతిరోజూ శనగపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేస్తుంటే ఆ వ్యాధులు మటుమాయమవటమే కాకుండా దేహానికి, ముఖానికి కాంతి వస్తుంది. మొటిమలు నశిస్తాయి.