శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 జూన్ 2018 (16:23 IST)

మిరియాల పొడి, ఉప్పుతో బ్రష్ చేసుకుంటే?

మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విషానికే విరుగుడుగా మిరియాలు పనిచేస్తాయి. గుప్పెడు మిరియాలు, అర కప్పు గరికను కషాయంగా తయారు చేసుకుని.. సేవిస్తే.. అలెర్జీలు దూరమవుతాయి. ఈ మందు పురుగుల కాట్లకు వ

మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విషానికే విరుగుడుగా మిరియాలు పనిచేస్తాయి. గుప్పెడు మిరియాలు, అర కప్పు గరికను కషాయంగా తయారు చేసుకుని.. సేవిస్తే.. అలెర్జీలు దూరమవుతాయి. ఈ మందు పురుగుల కాట్లకు విరుగుడుగా పనిచేస్తుంది. గొంతు నొప్పి, వాత సమస్యలు తొలగిపోవాలంటే.. 50 గ్రాముల మిరియాల పొడిని.. అరలీటరు నీటిలో చేర్చి 30 నిమిషాల పాటు బాగా మరిగించి.. 25 మి.లీ మేర మూడు పూటలా సేవిస్తే అనారోగ్య సమస్యలుండవు. 
 
జుట్టు రాలడం, బట్టతల వంటి సమస్యకు చెక్ పెట్టాలంటే.. మిరియాల పొడి, ఉల్లిపాయలు, ఉప్పు ఈ మూడింటిని పేస్టులా చేసుకుని మాడుకు పట్టిస్తే.. జుట్టు పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరాన్ని దూరం చేసుకోవాలంటే.. బాగా మరిగించిన పాలలో చిటికెడు మిరియాల పొడి, చిటికెడు పసుపు పొడి చేర్చి రాత్రి ఓ పూట సేవిస్తే తక్షణమే ఉపశమనం లభిస్తుంది. 
 
కీళ్ల నొప్పులను కూడా మిరియాల పొడి నయం చేస్తుంది. ఓ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని నువ్వులనూనెలో కలిపి పేస్టులా చేసి.. నొప్పులున్న ప్రాంతంలో పూతలా వేసుకుంటే మంచి ఫలితం వుంటుంది. మిరియాల పొడి, ఉప్పును కలిపి బ్రష్ చేసుకుంటే.. దంత సమస్యలు, పళ్లు పుచ్చిపోవడం, చిగుళ్ల నొప్పులు, నోటి దుర్వాసన వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.