Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నానబెట్టిన నువ్వులను పాలతో కలిపి తీసుకుంటే...?

మంగళవారం, 16 మే 2017 (21:37 IST)

Widgets Magazine
sesame

నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. చూసేందుకు చిన్నవిగా వున్నా వాటి శక్తి మాత్రం అపారం. అవేంటో ఒక్కసారి చూద్దాం.
 
* రక్తహీనతతో బాధపడే పిల్లలు, పెద్దలు ప్రతిరోజూ నానబెట్టిన ఓ టీస్పూన్ నువ్వులను మూడు నెలలపాటు క్రమం తప్పకుండా తిన్నట్లయితే రక్తం బాగా వృద్ధి చెందుతుంది. అలాగే మలబద్ధకం, మల విసర్జనలో సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ ఓ టీస్పూన్ నువ్వులను మెత్తగా దంచి దానికి పావు టీస్పూన్ వెన్న కలిపి తింటే మంచి ఫలితం కనిపిస్తుంది.
 
* అతిమూత్ర వ్యాధితో ఇబ్బందిపడేవారు ఓ టీస్పూన్ నువ్వులను పొడిచేసి, గోరువెచ్చటి నీటితో కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఎముకల వ్యాధులు, కీళ్ల నొప్పులు, చర్మ సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. నువ్వుల నూనెతో శరీరమంతటా మర్దనా చేస్తే కండరాల నొప్పులు క్రమంగా తగ్గుతాయి. సొరియాసిస్ లాంటి చర్మ వ్యాధులు నయమవుతాయి.
 
* నువ్వులు ఆహారంలో భాగంగా తీసుకోవటంవల్ల మంచి ఫలితాలుంటాయన్నది వాస్తవమే అయినా.. వాటిని మోతాదుకు మించి తీసుకున్నట్లయితే.. అజీర్ణం, విరేచనాలు, కడుపు ఉబ్బరం, వాతమెక్కి కాళ్లు, చేతులు లాగటం, శరీరం బరువు పెరగటం లాంటి సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకనే రోజుకి 20 గ్రాముల వరకు మాత్రమే నువ్వులను తీసుకోవాలి.
 
* నువ్వులను ఆహారంలో భాగంగా తీసుకుంటే స్త్రీలలో హార్మోన్ల సమస్యలు దరిచేరవు. పీరియడ్స్‌కు వారం రోజుల ముందుగా ఓ చెంచాడు నువ్వులను పొడిచేసి.. బెల్లం లేదా ఇంగువతో కలిపి తీసుకోవాలి. ఇలా చేయటంవల్ల పీరియడ్స్‌ను సక్రమంగా వచ్చేలా చేయటంతోపాటు, ఆ సమయంలో వచ్చే కడుపు, నడుము నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.
 
* కండరాల బలహీనత కలిగిన, ఎదుగుదల సరిగాలేని పిల్లలకు ప్రతిరోజూ ఉదయంపూట నానబెట్టిన ఓ చెంచాడు నువ్వులను తినిపిస్తే మంచి ఫలితం లభిస్తుంది. అలాగే ఎముకల బలహీనతతో బాధపడే వృద్ధులు, అస్టియోపోరాసిస్ లాంటి సమస్యలతో బాధపడేవారు ఉదయాన్నే నానబెట్టిన నువ్వులను పాలతో కలిసి తీసుకోవాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

స్త్రీలకు వార్నింగ్... పురుషులు వాడాల్సినవి పక్కన పడేసి స్త్రీకి గర్భ నిరోధక మాత్రలా?

ఇప్పుడే పిల్లలు వద్దు అని చాలామంది జంటలు పెళ్లయిన తర్వాత అనుకుంటారు. కొంతకాలం సంతోషంగా ...

news

అల్లం చేసే మేలెంతో తెలుసా?

త్రిదోషాలైన వాత, పైత్య, శ్మేష్మాలను హరించే శక్తి అల్లానికి ఉంది అల్లం నోటికి మంచి రుచిని ...

news

కీళ్ళ నొప్పులను దూరం చేసే ఆవనూనె.. ఎలాగంటే?

ఆవనూనెలో గానీ, నువ్వుల నూనెలో గానీ, నాలుగు వెల్లుల్లిపాయలు వేసి వేడిచేసి నొప్పులున్న ...

news

వేసవిలో చికెన్ తింటే వేడి చేస్తుంది.. ఎందుకని?

వేసవిలో కాకుండా శీతాకాలమైనా, వర్షాకాలమైన చికెన్ తింటే చాలామందికి వేడి చేస్తుంది. అందుకనే ...

Widgets Magazine