శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By PYR
Last Updated : ఆదివారం, 25 జనవరి 2015 (11:17 IST)

వేవిళ్లను అడ్డుకోవడం మంచిది కాదా..? ఆరోగ్య సమస్యలు వస్తాయా?

స్త్రీ గర్భం ధరించే సమయంలో వచ్చే వేవిళ్లను అడ్డుకోవడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయా..? అవుననే చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు దాని వలన భవిష్యత్తులో రక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని అంటున్నారు. ఎటువంటి సమస్యలు వస్తాయి? వాంతులు వచ్చినప్పుడు చేయాల్సిన పని ఏమిటి? రండీ తెలుసుకుందాం.
 
శరీరానికి ఒక ధర్మం ఉంది. మన శరీర నిర్మాణం కూడా చాలా క్లిష్టంగా ఉంటుంది. దాని ప్రకారమే అది నడుచుకుంటుంది. ఒక సంచిలో ఏదైనా పదార్థం వేసి తల్లకిందులు చేస్తే అది కింద పడిపోతుంది. మనం ఆహారం తీసుకున్న తరువాత, పీకల దాకా తిని తల్లకిందులు వేలాడినా బయటకు రాదు .. ఎందుకు?  అదే మరి.. మన శరీర ఆకృతిలోని రహస్యం. అదే విధంగా కొన్ని సందర్భాలలో వాంతి చేసుకో్వడం మొదలు పెట్టి ఆపాలన్నా ఆపలేం. అది సాధ్యం కాదు కూడా. అది శరీర ధర్మం. మన శరీరంలో స్వతహాగానే ఒక యంత్రాంగం ఉంటుంది. రోగి కంటే ముందు మేల్కొంటుంది. అది వైద్యుడి కంటే ముందు స్పందిస్తుంది. అందుకే శరీరానికి హాని కలిగించే పదార్థాలను దేనిని లోపల ఉండనివ్వదు. బయటకు నెట్టేస్తూనే ఉంటుంది. ఉదాహరణకి తమ్ములు.. ఏదైనా ఒక క్రిమి లోని వెళ్ళిందంటే లోపల ఉన్న కొన్ని లక్షలుగా ఉన్న మంచి బాక్టీరియా  అంతా ఒక చోటుకు చేరి క్రిములను తుమ్ముల రూపంలో బయటకు నెట్టేస్తాయి. 
 
అప్పుడే మనం రిలీఫ్ గా ఉంటాం. అలాగే వాంతులు కూడా శరీరానికి అవసరం లేని వాటిని గర్భ సమయంలో వేవిళ్ళ రూపంలో బయటకు నెట్టేస్తాయి. తన పని పూర్తవగానే వేవిళ్లు వాటంతట అవే ఆగి పోతాయి. కానీ మనం ఏం చేస్తున్నాం. వాటి పనిని అవి చేయనీకుండా అడ్డుకుంటున్నాం. ఏ డాక్టరు దగ్గరకో వెళ్లి వాంతులు నిలిచిపోయేలా మందులు తీసుకుంటున్నాం. ఇది శరీర ధర్మానికి విరుద్ధమేగా. అంటే చెడు కారకాలను బలవంతంగా లోపలే పెడుతున్నాం కదా.. ఇది ప్రమాదం కూడా భవిష్యత్తులో దీని వలన చర్మవ్యాధులు రావచ్చు. శరీరమంతా నల్లని మచ్చలు రావడం పొక్కులు లేయడం అన్నవాహిక, చాతీలో మంట రావడం వంటివి రావచ్చు. కాబట్టి వీలైనంత వరకూ వేవిళ్లు ఆపకూడదని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.