Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎండాకాలంలో చెరుకు రసం... ఈ రసాన్ని ఎవరు తాగకూడదో తెలుసా?

గురువారం, 16 మార్చి 2017 (21:08 IST)

Widgets Magazine

చెరుకులో కూడా రకాలున్నాయి. వీటిలో తెల్ల చెరుకు, నల్ల చెరుకు, ఎర్ర చెరుకు అనేవి ప్రధానమైనవి. ఐతే అన్ని రకాల చెరుకు గుణాలు దాదాపు ఒక్కటే. చెరుకు రసం తాగినప్పుడు మొదట్లో కొద్దిగా వేడి చేసినట్లనిపిస్తుంది కానీ తర్వాత చలవ చేస్తుంది. చెరుకు రసం తాగితో కొవ్వు చేరుతుంది. రక్తాన్ని శుభ్రం చేయడమే కాదు పురుషుల్లో వీర్యపుష్టిని కలిగిస్తుంది. పొట్టను శుభ్రం చేస్తుంది. 
 
కొంతమంది చెరుకును కాల్చి దాని రసాన్ని పిండి తాగుతుంటారు. ఇలా చేయకూడదు. ఇది వాతం చేస్తుంది. కంటి సమస్యలను కలిగిస్తుంది. చెరుకును తినేటప్పుడు, చెరుకు రసాన్ని తీసేటప్పుడు చెరుకు కొనల, మొదళ్లను, కణుపులను తీసివేసి మిగతా భాగాన్ని తినాలి. భోజనం చేసిన వెంటనే చెరుకు రసం తాగకూడదు. తాగితే ఆహారం సరిగా జీర్ణం కాదు. 
 
యంత్రాల ద్వారా తీసిన చెరుకు రసాన్ని కొందరు తాగుతుంటారు. ఇందులో అనేక మలినాలుంటాయి. అందువల్ల దాన్ని తాసుకోరాదు. పిల్లలు పళ్లు పుచ్చుపట్టి నలుపెక్కి వుంటే చెరుకుని తిన్నప్పుడు పుచ్చిపోయిన పళ్లు తెల్లగా వస్తాయి. 
 
చెరుకు రసాన్ని మధుమేహం, అజీర్ణం, ముక్కు సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు, జ్వరం, శరీరం వాపు వున్నవారు తాగకూడదు. ఐతే చెరుకు రసాన్ని ఎక్కువ తాగి ఇబ్బందిపడుతుంటే దానికి విరుగుడుగా సోపు గింజల రసం, అల్లపు రసం పనిచేస్తాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఉపవాసం ఉంటే.. నిత్యయవ్వనులుగా ఉంటారట.. బరువు కూడా తగ్గుతారట..

ఉపవాసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పెద్దలు ఎప్పుడో చెప్పేశారు. అయితే అమెరికా ...

news

ఇబూప్రోఫెన్ అతిగా వాడితే.. హృద్రోగ సమస్యలు తప్పవు

ఇబూప్రోఫెన్ తీసుకుంటున్నారా? అయితే కార్డియా ముప్పు పెరుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. ...

news

మీరు ఆరోగ్యంగా ఉండాలా.. అయితే మంచి నీరు ఇంతే తాగండి..!

నీరు ఎంత తాగితే అంత మంచిదని లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పదేపదే నీళ్లు తాగే వారు చాలా ...

news

మునగాకు, దోసకాయ రసాన్ని ప్రతిరోజూ తాగితే..?

మునగాకులో ఆరోగ్య రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. ...

Widgets Magazine