తులసి ఆకుల టీతో ముఖాన్ని కడిగితే..

వాతావరణ కాలుష్యాల వలన చర్మం ప్రకాశవంత రహితంగా ముఖ ఛాయను జీవ రహితంగా మార్చుతుంది. ఈ సమస్యను తులసి సహజంగా తగ్గిస్తుంది. తులసి ఆకులతో చేసిన టీతో ముఖాన్ని కడిగి తరువాత గోరు వెచ్చని నీటితో కడిగాలి. చర్మాన్

health tips
Kowsalya| Last Updated: మంగళవారం, 15 మే 2018 (12:20 IST)
వాతావరణ కాలుష్యాల వలన చర్మం ప్రకాశవంత రహితంగా ముఖ ఛాయను జీవ రహితంగా మార్చుతుంది. ఈ సమస్యను తులసి సహజంగా తగ్గిస్తుంది. తులసి ఆకులతో చేసిన టీతో ముఖాన్ని కడిగి తరువాత గోరు వెచ్చని నీటితో కడిగాలి. చర్మాన్ని శుభ్రంగా చేస్తుంది. మీ ముఖాన్ని మెరుగుపరుస్తుంది. 
 
తులసిఆకులను మెత్తగా నూరి శరీరానికి రాసుకుని 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే చర్మ వ్యాధులు నయవుతాయి. తులసి ఆకురసం, నిమ్మరసం కలిపి చర్మానికి పూసుకుంటే తామరవ్యాధి నయమవుతుంది. పుదీనా ఆకులను మెత్తగా నూరి ప్రతిరోజు రాత్రపూట ముఖానికి రాసి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మెుటిమలు మచ్చలు తగ్గిపోతాయి.
 
వేపాకు మరిగించిన నీటితో తలస్నాసం చేస్తే జుట్టు ఊడటం తగ్గి వెంట్రుకలు నల్లగా బారుగా పెరుగుతాయి. వేపాకులను వేడినీటిలో నానబెట్టి ఆ నీటిని స్నానానికి ఉపయోగిస్తే శరీరం మీదనున్న మచ్చలు త్వరగా పోతాయి.
 
ఒకకప్పు వేపాకు తీసుకుని అందులో కొద్దిగా నీటిని మరిగించి చల్లార్చిన తరువాత ఆ నీటిని వడగట్టి మీ ముఖానికి రాసుకుంటే ఆయిల్ స్కిన్ వారికి చాలా మంచిది. తులసిరసంలో కొంచెం తేనేకలిపి ప్రతిరోజు తీసుకుంటే బొంగురు పోయిన కంఠం చక్కగా పనిచేస్తుంది. ఒక స్పూన్ తులసిరసం ప్రతిరోజు త్రాగడం వలన రక్తం శుభ్రపడుతుంది.దీనిపై మరింత చదవండి :