గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By ivr
Last Modified: బుధవారం, 1 ఏప్రియల్ 2015 (16:35 IST)

పుచ్చకాయలు తింటాం... మరి వెర్రిపుచ్చకాయతో మేలేంటి...?

పుచ్చకాయలు మూడు రకాలుగా ఉంటాయి. మొదటిది ఎర్ర గింజలతో ఉంటాయి. రెండో రకం నల్ల గింజలతో ఉంటుంది. మూడవది వెర్రిపుచ్చ. వీటిలో మొదటి రెండు రకాల గుణాలు ఒకే విధంగా ఉంటాయి. వాటినే మనం తింటూ ఉంటాం. కానీ వెర్రిపుచ్చను మాత్రం కేవలం వైద్యానికి మాత్రమే వాడుతుంటారు. ఇది కఫం కలిగిస్తుంది. వాతం కలిగిస్తుంది. పైత్యాన్ని వేడిని తగ్గిస్తుంది. బాగా చలవ చేస్తుంది. వేడి వలన కలిగే దాహాన్ని తగ్గించడంలో దీనికి మరేదీ సాటిలేదంటారు. టైఫాయిడ్ తదితర వ్యాధులకు దీనిని వాడుతారు. ఇది ప్రేవులలో వ్రణాలు, జీర్ణకోశంలోని వ్రణాలు రాకుండా చేస్తుంది. చిక్కిపోయి బక్కగా ఉండేవారు దీనిని పాలతో కలిపి వాడితే వేడి తగ్గి బలిష్టంగా మారుతారు. 

 
అంతేకాదు.. ఈ వెర్రిపుచ్చకాయ మూర్చరోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఐతే వాత శరీరం కలిగినవారికి ఇది మంచిది కాదు. దీనిని తీసుకున్నవారిలో మూత్రం బాగా జారీ అవుతుంది. వేడి శరీరం కలిగినవారు దీనిని చింతపండు పులుసుకూరగా వాడితే మేలు చేస్తుంది. మూలశంక ఉన్నవారికి ఆ సమస్యను తగ్గించడంలో దోహదపడుతుంది. దీనిని ఎక్కువగా వాడినప్పుడు ఎలాంటి వికారాలయినా కలిగితే తేనె, పంచదార తీసుకుంటే దానికి విరుగుడుగా ఇవి పనిచేస్తాయి.