మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : బుధవారం, 23 నవంబరు 2016 (13:38 IST)

చలికాలంలో వ్యాధినిరోధక శక్తి పెరగాలంటే.. దాల్చిన చెక్క తీసుకోవాల్సిందే

చలికాలంలో జ్వరం, జలుబు వంటి అనారోగ్య సమస్యలు తప్పవు. అయితే చలికాలంలో వ్యాధినిరోధక శక్తి ఎక్కువ కలిగిన వారిని జలుబు, జ్వరం వంటి సమస్యలు ఏమీ చేయలేవు. అందుకే ఈ సీజన్‌లో ఆహారంలో దాల్చిన చెక్కను ఉపయోగించాల

చలికాలంలో జ్వరం, జలుబు వంటి అనారోగ్య సమస్యలు తప్పవు. అయితే చలికాలంలో వ్యాధినిరోధక శక్తి ఎక్కువ కలిగిన వారిని జలుబు, జ్వరం వంటి సమస్యలు ఏమీ చేయలేవు. అందుకే ఈ సీజన్‌లో ఆహారంలో దాల్చిన చెక్కను ఉపయోగించాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దాల్చిన చెక్క, అల్లం వంటి యాంటీవైరల్ మూలికలతో కలిపి కాలానుగుణంగా సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా మనలోని రోగనిరోధక వ్యవస్థను పెంచుకోవచ్చు. 
 
అల్లం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరం నుంచి అధిక తేమను తప్పించేందుకు అల్లం, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, జాజికాయ వంటి సుగంధ ద్రవ్యాలు కూరల్లో జోడిస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. సీజన్లలో మార్పువచ్చినపుడు నారింజకాయలు, బంగాళాదుంప, గుమ్మడికాయలు ఆహారంలో తీసుకోవడం మేలంటున్నారు. 
 
వాము ఆకు జలుబు, ఫ్లూ, సైనసిటిస్‌కు వ్యతిరేకంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నిమ్మకాయలు, నారింజ, ద్రాక్ష, కివీస్ పండ్లలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. దీని వల్ల వైరల్ అంటువ్యాధులు నివారించవచ్చు.