శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : శనివారం, 13 జూన్ 2015 (18:02 IST)

సంతానలేమికి చెక్ పెట్టాలంటే.. మహిళలు ఏం తినాలి?

సంతానలేమికి విటమిన్ సి, ఇ, జింక్, ఫోలిక్ యాసిడ్ లేమినే కారణమౌతున్నాయి. కొన్ని ప్రత్యేకమైన విటమిన్స్, మినిరల్స్ వంటివి ఆరోగ్యకరమైన స్పెర్మ్(వీర్యకణాల ఉత్పత్తికి) అవసరం అవుతాయి.

అలాగే మహిళలు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఆహారంలో మార్పులు చేయాలి. ఎవరైతే ఎక్కువగా అనిమల్ ప్రోటీన్ తీసుకుంటారో వారు గర్భం పొందే చాన్సెస్ తక్కువ. అదే ప్లాంట్ ప్రోటీన్స్ తీసుకొనే వారు గర్భం పొందే అవకాశాలు ఎక్కువ. అందుకే కూరగాయల్లో బీన్స్‌ను ఎక్కువగా తీసుకోవాలి. 
 
పాలు, మిల్క్ ప్రొడక్ట్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. పాలలో ఉండే ఫ్యాట్ హార్మోనులను బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతాయి. త్వరగా గర్భం పొందాలంటే పాలు మరియు పాల ఉత్పత్తులను తీసుకోవాలి. ఆకుకూరలు, బ్రొకోలీ, డార్క్ లీఫీ వెజిటేబుల్స్ వంటివి త్వరగా గర్భం పొందడానికి సహాయపడుతాయి.

ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్‌లో ఫొల్లెట్, విటమిన్ బి అధికంగా ఉంటుంది. ఇది ఓవొలేషన్‌కు సహాయపడుతుంది. పురుషుల్లో హెల్తీ స్పెర్మ్ ఉత్పత్తికి సహాయపడుతుంది. వీటితో పాటు గుమ్మడి విత్తనాలు, వీట్ బ్రెడ్, ఆలివ్ ఆయిల్, సాల్మన్ ఫిష్ వంటివి డైట్‌లో చేర్చుకుంటే సంతానలేమిని దూరం చేసుకోవచ్చు.