శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (14:21 IST)

క్రాన్ బెర్రీ జ్యూస్‌ను రోజంతా తాగితే..?

క్రాన్ బెర్రీ జ్యూస్ తాగండి.. ఒబిసిటీని దూరం చేసుకోండి! అంటున్నారు వైద్యులు. క్రాన్ బెర్రీ జ్యూస్‌లో ఆర్గానిక్ యాసిడ్స్, మాలిక్ ఆసిడ్, సిట్రిక్ ఆసిడ్, క్వినిక్ ఆసిడ్స్ కలిగి ఉంటాయి. వీటి పని జీర్ణ రసాలను ఉత్పత్తి చేయడం. 
 
ఈ ఎంజైములు కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తాయి. అంతే కాదు, కాలేయంలో జీర్ణక్రియకు అడ్డుపడే టాక్సిన్స్‌ను తొలగించేస్తాయి .
 
క్రాన్ బ్రెర్రీ జ్యూస్ కాలేయంలో ఉండే లింపాటిక్ వేస్ట్‌ను జీర్ణం అయ్యేలా చేస్తుంది. దాంతో కొవ్వు కరుగుతుంది. కాబట్టి ఒబిసిటీని దూరం చేసుకోవాలంటే 100శాతం క్రాన్ బెర్రీ జ్యూస్ లేదా క్రాన్ వాటర్‌ను త్రాగండి.
 
క్రాన్ బెర్రీ జ్యూస్ ఎలా చేయాలంటే.. 
క్రాన్ బెర్రీ జ్యూస్ : ఒక కప్పు 
నీరు: రెండు మూడు కప్పులు 
 
* ప్రతి రోజూ ఉదయం క్రాన్ బెర్రీ జ్యూస్‌లో నీరు కలిపాలి. అంతే రోజంతటికి సరిపడే క్రాన్ వాటర్ రెడీ.
* ఈ క్రాన్ వాటర్‌ను రోజంతా తాగుతుండాలి. 
* అలాగే బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్‌కు ముందు, తర్వాత కూడా ఒక కప్పు క్రాన్ వాటర్ త్రాగితే ఉత్తమ ఫలితం ఉంటుంది.
* క్రాన్ వాటర్ ను తయారుచేసుకోవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల క్రాన్ బెర్రీ జ్యూస్‌లో ఒక కప్పు కంటే తక్కువ నీరు మిక్స్ చేసి తీసుకోవాలి.