శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 12 డిశెంబరు 2014 (16:23 IST)

పనిలో పడి నీళ్లు తాగడం మరిచిపోతున్నారా?

పనిలో పడి నీళ్లు తాగడం మరిచిపోతున్నారా? అయితే జాగ్రత్త పడండి. లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా నీళ్లు తాగకపోతే దానివల్ల తలనొప్పులు, అలసట, శరీరంలో శక్తిలేకపోవడం వంటి రుగ్మతలు తప్పవు. అందుకే కాస్త దాహంగా అనిపించినా ఎంత పనిలో ఉన్నా సరే పక్కన పెట్టేసి వెంటనే కనీసం రెండు గ్లాసుల నీళ్లు తాగండి. అప్పుడప్పుడు కాస్త నీటిని తాగడం ద్వారా బరువు కూడా తగ్గవచ్చుననే విషయం గుర్తుంచుకోండి. 
 
ఆదివారం వచ్చిందంటే.. చాలా మంది మహిళలు పనుల్లో మునిగిపోతుంటారు. అలా చేయకుండా కాసేపు అలా నడుం వాల్చండి. లేకుంటే వర్కింగ్ వుమెన్‌కు కష్టమే. వారానికి ఓ సారైనా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటేనే అది రీఛార్జిలా పనిచేస్తుంది.
 
రోజంతా చురుగ్గా పనులు చక్కబెట్టాలంటే వ్యాయామాన్ని మించిన పరిష్కారం లేదని, తల్లులకు ఇది చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వ్యాయామం చేసేందుకు టైమ్ లేకపోతే ఇంటి పనుల్లో భాగంగానే మెట్లెక్కి దిగండి. 
 
పిల్లల కోసం రుచికరమైన పదార్థాలూ, టిఫిన్లూ చేయడం, ఆనందించడం ఒక్కటే కాదు.. ఎంత హడావుడిగా ఉన్నా.. రోజూ పొద్దున్నే టిఫిన్ మాత్రం మానేయకండి. రోజంతా చురుగ్గా ఉండేందుకు ఇది ఒక చక్కని పరిష్కారం. అలాగే వేళకు భోజనం చేయాల్సింది కూడా చాలా ముఖ్యమే. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి.