గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : బుధవారం, 4 మార్చి 2015 (13:39 IST)

మహిళల్లో వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే..?

మహిళల్లో వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే.. తేనె అద్భుతంగా పనిచేస్తుంది. తేనె, దాల్చిన చెక్క కాంబినేషన్ వ్యాధినిరోధకతను పెంచుతుంది. శరీరాన్ని బ్యాక్టీరియా, వైరల్ అటాక్స్ నుండి రక్షణ కల్పిస్తుంది. వివిధ రకాల విటమిన్స్, ఐరన్ ఇందులో పుష్కలంగా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. కాబట్టి, తేనెను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల వ్యాధినిరోధకతను పెచుతుంది.
 
ఇంకా దాల్చిన చెక్క, తేనె మిశ్రమంలో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు పోసి, బాగా మిక్స్ చేసి, ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడానికి ఒక గంట ముందు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే రాత్రి నిద్రించే ముందు కూడా తీసుకుంటే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.