శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (14:29 IST)

చర్మం మృదువుగా కోమలంగా తయారవ్వాలంటే..?

చర్మం మృదువుగా కోమలంగా తయారవ్వాలంటే..? నారింజ, పీచెస్, పైనాపిల్ జ్యూస్ తీసుకోవాలని బ్యూటీషన్లు అంటున్నారు. నారింజలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్‌ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. 
 
చర్మం ముడుతలు పడకుండా, టైట్‌గా ఉంచే కొలాజిన్‌‌ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక నారింజను తినడం మంచిది. రోజుకు రెండు వందల గ్రాముల విటమిన్ సి అవసరమవుతుంది. నారింజ జ్యూస్‌ తాగడం కన్నా పండు రూపంలో తినడమే మంచిది.
 
అలాగే పీచెస్ ఆరోగ్యానికి మాత్రమే కాదు గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది. ఇది చర్మాన్ని శుభ్రపరిచి, బిగుతు చేయడానికి మాత్రమే కాదు, ముఖ కండరాలను బిగుతుగా ఉండేలా చేస్తుంది. అందుకు పీచెస్ పండ్ల మీద ఉన్న తొక్కను తొలగించి లోపల ఉన్న పదార్థంతో ముఖాన్ని బాగా మర్దన చేసుకోవాలి. దాంతో వెంటనే మీరు ఫ్రెష్‌గా ఫీల్ అవ్వడమే కాకుండా చర్మం బిగుతుగా తయారవుతుంది.
 
సువాననందించే పైనాపిల్ చర్మ సంరక్షణలో బాగా ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని శుభ్రపచడమే కాకుండా నిర్జీవంగా మారిన, పొడి బారిన చర్మాన్ని తేజోవంతం చేసి, చర్మాన్ని మృదువుగా తయారు చేస్తుంది. పైనాపిల్ ముక్కలను ముఖం, శరీరం మీద కొద్దిసేపు రుద్ది స్నానం చేసినట్లైతే తాజాగా ఫీలవుతారు.