గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : శనివారం, 15 నవంబరు 2014 (17:21 IST)

ఆయిల్ ఫుడ్స్ స్నాక్స్‌గా వద్దు.. డ్రై ఫ్రూట్స్, నట్స్ తీసుకోండి!

అధిక బరువు పెరిగితే ఒబిసిటి, కొలెస్ట్రాల్, అధిక బ్లడ్ ప్రెజర్ వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి అధిక బరువును తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ముందుగా రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతున్నారో లెక్కేసుకోండి. ఆరోగ్యకరమైన జీవితానికి తగినంత నిద్ర అవసరం. మనిషికి కనీసం 7-8గంటల నిద్రఅవసరం. నిద్రలో వ్యత్యాసం లేకుండా ప్రతి రోజూ ఒకే సమయానికి క్రమంగా నిద్రపోవాలి. నిద్రలో వ్యత్యాసం వల్లే బరువు పెరగడంలో హెచ్చుతగ్గులు ఏర్పడుతాయి. కాబట్టి సరైన నిద్ర, సమయపాలన అవసరం. 
 
స్నాక్స్ తినాలనుకొనే వారు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నటువంటి ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిది. డ్రై ఫ్రూట్స్, నట్స్, వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను తీసుకోవడం ద్వారా బరువును నియంత్రించడం జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.