శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2015 (17:36 IST)

సమ్మర్లో సాల్మన్ ఫిష్ తినండి.. హెల్దీ స్కిన్ పొందండి!

సమ్మర్లో సాల్మన్ ఫిష్ తినండి.. హెల్దీ స్కిన్ పొందండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. హెల్తీ సమ్మర్ స్కిన్ పొందాలంటే సాల్మన్ ఫిష్‌ను కూడా రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలి. అలాగే టమోటోలలో ఉండే లైకోపిన్ అనే కంటెంట్ చర్మం సంరక్షణకు చాలా అవసరం. ఇది ముఖంలో ముడతలు తగ్గించి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. వేసవిలో టమోటా జ్యూస్ ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. 
 
ఇకపోతే.. బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. యూవి కిరణాల వల్ల స్కిన్ డ్యామేజ్ నివారించడంలో ఇవి గ్రేట్‌గా సహాయపడుతాయి. వేసవిలో చర్మాన్ని కాంతివతంగా, ప్రకాశవంతంగా మార్చాలంటే.. సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవాలి. చర్మం ఆరోగ్యంగా, ప్రకాశావంతంగా మార్చడంలో కొల్లాజెన్ బాగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.