గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 నవంబరు 2014 (18:59 IST)

బ్రెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టే టమోటో!

గుండె జబ్బుల రిస్క్‌ను బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పును నివారించాలంటే.. టొమోటాను తీసుకోవాలి. టొమాటోలోని లైకోపీన్ రొమ్ముక్యాన్సర్‌ను నివారిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది.
 
అలాగే తోటకూరను కూడా తీసుకుంటే.. విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. దీనిలోని మెగ్నీషియం ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (పిఎంఎస్) సమస్యను తగ్గిస్తుంది.
 
ఇక మహిళలు చేపలు వారానికి ఒక్కసారైనా రెండుసార్లైనా తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు డిప్రెషన్ నుంచి గుండెజబ్బుల దాకా అన్నింటినీ నివారించగలవు.
 
అలాగే బిపి నుంచి మధుమేహం దాకా మంచి మందులా పనిచేసే ఓట్స్ గర్భిణి స్త్రీలకు మరింత మేలు చేస్తాయి. గర్భిణులు వీటిని తీసుకోవడం వల్ల పుట్టే శిశువుకు జన్యులోపాలు కలిగే అవకాశం చాలా తక్కువని ఆరోగ్య నిపుణులు సూచనలు ఇస్తున్నారు.