గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (16:01 IST)

దీపావళిరోజు అందంగా కనిపించాలంటే 3 టిప్స్ పాటించండి!

దీపావళి రోజున కొత్త బట్టలు వేసుకుంటాం.. కానీ ఫేస్ మాత్రం డల్‌గా ఉందే.. అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలోచించడం.. దీపావళి నాడు అందంగా కనిపించాలంటే ఈ 3 టిప్స్ పాటించండి. 
 
ముఖం అందంగా కనిపించాలంటే ముందుగా కళ్లను బ్యూటీ చేసుకోవాలి. నిద్రలేమి, స్ట్రెస్, డైట్ ప్రభావంతో కళ్ళక్రింది నల్లని సర్కిల్స్‌కు ప్రధాన కారణం. కాబట్టి, తాజాగా కట్ చేసి కీరదోసకాయ ముక్కలను కళ్ళ మీద కొద్దిసేపు పెట్టుకోవాలి. అలసిన కళ్ళకు ఉపశమనం కలిగించి డార్క్ సర్కిల్స్‌ను నేచురల్ గా తొలగిస్తుంది
 
దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరూ అందంగా, ప్రకాశవంతంగా కనబడాలనుకుంటే, కొన్ని హోం మేడ్ స్కిన్ వైటనింగ్ ప్యాక్స్‌ను వేసుకోవాలి. స్ట్రాబెర్రీ, పాల ప్యాక్, సున్నిపిండి లేదా లేదా ముల్తానీ మట్టి ప్యాక్ వేసుకోవడం ద్వారా ఫేస్ వైట్నింగ్‌తో పాటు బ్యూటీని సంతరించుకుంటుంది.  
 
చర్మ సంరక్షణ కోసం మాయిశ్చరైజింగ్ క్రీమ్ వాడండి. జుట్టు సంరక్షించుకోండి. హెయిర్ కట్ చేయించుకోవడం కలరింగ్ వంటివి పాటించవచ్చు. జుట్టుకు పెరుగు, తేనె, గుడ్డు లేదా వెనిగర్ అప్లై చేయడం ద్వారా కేశాలు సాప్ట్‌గా ప్రకాశవంతంగా సిల్కీగా మెరుస్తుంటాయి.