గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi

యాంటీ ఏజింగ్ లక్షణాలకు చెక్ పెట్టాలా? నిద్రే దివ్యౌషధం!

కంటిచుట్టూ చర్మం.. నల్లటి వలయాలు తగ్గాలంటే.. ప్రతిరోజూ కంటి చుట్టూ యాంటీ ఏజింగ్ క్రీమ్ వంటివి వాడితే సరిపోదు. ఎండల్లో ఎక్కువ సేపు తిరగాల్సి వస్తే సన్ గ్లాసెస్ తప్పనిసరి. ఎలాంటి సంరక్షణ లేకుండా ఎండకు, గాలికి ఎక్కువ సేపు బయటున్నా చర్మకణాలు దెబ్బతింటాయి. అందుచేత ఎండలోకి వెళితే సన్ స్క్రీన్ రాసుకోవడం తప్పనిసరి. అయితే సన్ స్క్రీన్ క్రీమును కళ్ల చుట్టు రాయకూడదు. 
 
ఇందుకోసం మినరల్ సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలి లేదా వైద్యుల సూచన మేరకు సన్‌ప్రొటెక్షన్ ఐ క్రీమ్‌ను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా అలసట ఉండకూడదు. కంటికి తగిన విశ్రాంతి ఇవ్వాలి. యాంటీ ఏజింగ్ లక్షణాలు తొలగిపోవాలంటే రోజుకు 8 గంటలు నిద్రపోవాల్సిందే. నిద్రించేటప్పుడు తల-మెడ సమాంతరంగా ఉండేలా దిండును అమర్చుకోవాలి. దీనివల్ల కంటిచుట్టూ రక్తప్రసరణ సక్రమంగా అవుతుంది. చర్మం సాగినట్టు అవదు. చర్మం బిగుతుగా ఉంటుందని బ్యూటీషన్లు అంటున్నారు.