గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chj
Last Modified: బుధవారం, 20 జులై 2016 (13:26 IST)

క‌ల‌బంద(అలోవెరా)తో ఉపయోగాలు... గుజ్జును జుట్టుకు పట్టిస్తే...

ప్రతి ఇంటి పెరటిలోనూ దర్శనమిచ్చే 'కలబంద'ను చైనా తదితర దేశాల్లో చర్మ సంబంధిత సమస్యలకు చక్కటి నివారిణిగా ఉప‌యోగిస్తారు. అలోవెరా గుజ్జును చర్మానికి మాత్రమే కాదు ఇటు శరీర ఆరోగ్యానికి మరియు కేశాలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. * కలబంద గుజ్జు ముఖ సౌంద‌ర్యా

ప్రతి ఇంటి పెరటిలోనూ దర్శనమిచ్చే 'కలబంద'ను చైనా తదితర దేశాల్లో చర్మ సంబంధిత సమస్యలకు చక్కటి నివారిణిగా ఉప‌యోగిస్తారు. అలోవెరా గుజ్జును చర్మానికి మాత్రమే కాదు ఇటు శరీర ఆరోగ్యానికి మరియు కేశాలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
* కలబంద గుజ్జు ముఖ సౌంద‌ర్యాన్ని పెంపొందించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జులో తగినంత పసుపును జోడించి ముఖానికి ఫేషియల్ చేసుకుని 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే, ముఖం పైన పేరుకున్న మురికి తొలగిపోతుంది.
* జుత్తు సంరక్షణ విషయంలోనూ కలబంద కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జును తలకు పట్టించి ఓ గంట తరువాత తలస్నానం చేస్తే జుట్టు పెరగటమే కాకుండా నిగారింపును సంతరించుకుంటుంది. కలబంద చుండ్రును దరికి చేరకుండా చేస్తుంది. 
* అరికాలి పగుళ్లను కలబంద మటుమాయం చేస్తుంది. కలబందలో బి 12, సి, ఇ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. కళ్లు మంటలను కలబంద నివారిస్తుంది.
* చర్మ సమస్యల్లో మొటిమలు పెద్ద సమస్య. ముఖారవిందాన్ని పోగొడుతాయి. అందుకు ఈ గ్రీన్ కలర్ అలోవెరా అద్భుతంగా పనిచేస్తుంది. 
* చాలా రకాల హేర్బల్ ఫేస్ ప్యాక్ కూడా అలోవెరా జెల్‌ను ఉపయోగించి చర్మంలో అద్భుతమైన మార్పును ఇస్తుంది.
* ఇది హెయిర్ ఫాల్‌ను అరికడుతుంది. కురులు పెరిగేలా చేస్తుంది. ఇంకా కురులు సాఫ్ట్‌గా తయారవుతాయి. కాబట్టి మీరు మీ ఇంట్లో అలొవెరా చెట్టు పెంచుకోవడం వల్ల ఇటు స్కిన్, హెయిర్ బెనిఫిట్స్‌ను మెండుగా పొందవచ్చు.