గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : బుధవారం, 9 జనవరి 2019 (13:19 IST)

బీట్‌రూట్ రసంలో కొబ్బరినూనె కలిపి..?

ఇప్పటి చలికాలంలో అందం కాస్త విహీనంగా మారుపోతుంది. ముఖం పొడిబారడం. చేతులు, చర్మం ముడతలుగా మారడం వంటివి సహజంగా జరిగే సమస్యలే. వీటికి చెక్ పెట్టాలంటే.. బీట్‌రూట్ రసాన్ని ఉపయోగించాలని బ్యూటీ నిపుణులు చెప్తున్నారు. మరి బీట్‌రూట్ రసాన్ని వాడడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.. రండీ..
 
బీట్‌రూట్ ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది. అదేవిధంగా అందానికి కూడా పనిచేస్తుంది. బీట్‌రూట్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ చర్మాన్ని అందంగా మార్చేలా చేస్తాయి. ఇంకా చెప్పాలంటే.. ఈ చలికాలంలో ఏర్పడే చర్మ సమస్యలకు బీట్‌రూట్ బాగా పనిచేస్తుంది. మరి ఈ బీట్‌రూట్‌తో ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం...
 
ఒక చిన్న బీట్‌రూట్ తీసుకుని దాని తొక్కను తీసి కాయను మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై వీటిని మిక్సీలో మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను వడగట్టితే వచ్చే రసాన్ని మాత్రం ఓ బౌల్‌లో తీసుకోవాలి. ఈ రసంలో స్పూన్ కొబ్బరినూనె, కలబంద గుజ్జు 1 స్పూన్, వాసిలెన్ స్పూన్ మోతాదులో వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ఒక మూత గల డబ్బాలో భద్రపరచాలి. 
 
రాత్రివేళ నిద్రకు ఉపక్రమించే ముందుగా ఆ డబ్బాను తీసుకుని ఆ బీట్‌రూట్ పేస్ట్‌ను చేతులు, పాదాలకు రాసుకోవాలి. రాత్రంత అలానే ఉంచుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా వారంలో రెండుసార్లు క్రమంగా చేస్తే చేతులు, పాదాలు, చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతాయి. బయటదొరికే క్రీమ్స్ వాడడం కంటే.. ఇంట్లోనే ఇలాంటి చేసి చూడడండి.. తప్పక ఫలితం ఉంటుంది.