గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (17:23 IST)

అవొకాడో పేస్ట్, తేనెతో మాస్క్‌తో మెరిసే సౌందర్యం!

అవొకాడోను మెత్తగా పేస్ట్ చేసి అందులో తేనె మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. ఈ ఫేస్ మాస్క్ వల్ల చర్మం సున్నితంగా, మృదువుగా తయారవుతుంది. అంతే కాదు చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. అవొకాడోలో ఉండే పోషకాలు, చర్మానికి తగిన పోషకాలను అందిస్తుంది. 
 
తేనెలో నయం చేసే గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది చర్మం రంగును మార్చుతుంది. మొటిమలు, మచ్చలను, ఛారలను నివారిస్తుంది. నిమ్మరసం సున్నితమైన చర్మాన్నిబర్న్ చేస్తుంది. కాబట్టి, నిమ్మరసంకు బదులు తేనెను ఉపయోగించుకోవాలి.
 
కొబ్బరి నూనె, తేనె కాంబినేషన్‌లో పెదాలకు మాయిశ్చరైజింగ్‌గా ఉపయోగించుకోవచ్చు. తేనెలోని తియ్యదనం పెదాలకు ఎక్స్‌ఫ్లోయేట్ చేస్తుంది. రిఫ్రెష్‌గా కనబడుటకు సహాయపడుతుంది. అలాగే కాఫీ, తేనె, షుగర్ స్క్రబ్ కాంబినేషన్‌లో ఫేస్ స్క్రబ్ చేస్తే చర్మాన్ని ఎక్స్‌ఫ్లోయేట్ చేస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు.