శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (17:41 IST)

చర్మం మెరిసిపోవాలంటే... బొప్పాయి, బాదం, పుదీనా ప్యాక్ వేసుకోండి!

పోషకాహారం తీసుకోవడం ద్వారా చర్మ సౌందర్యం మెరుగవుతుందని బ్యూటీషన్లు చెబుతున్నారు. అలాగే బొప్పాయిలోనూ సౌందర్యాన్ని పెంపొందించే ఎన్నో సుగుణాలున్నాయి. 
 
బొప్పాయి గుజ్జు ఒక టేబుల్ స్పూన్, తేనె ఒక స్పూన్, నిమ్మరసం రెండు స్పూన్లు కలిపి పేస్ట్‌లా తయారయ్యాక ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతం అవుతుంది. చర్మం పొడిబారకుండా ఉంటుంది.
 
అలాగే కొత్తిమీర, పుదీనా ఆకులను సమానంగా తీసుకుని బాగా పేస్ట్‌లా చేసుకుని నిమ్మరసం చేర్చి ముఖానికి పట్టిస్తే.. జిడ్డు తొలగిపోతుంది. మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది.
 
ఇక బాదం, ఓట్స్ సరిపాళ్ళలో తీసుకుని బాగా పేస్ట్ చేసి ముఖానికి పట్టిస్తే..ముఖం కాంతివంతంగా తయారవుతుంది. అయితే మొటిమలు, సెన్సెటివ్ చర్మం కలిగినవారు ఈ మిశ్రమాన్ని ఉపయోగించకూడదని బ్యూటీ నిపుణులు అంటున్నారు.