బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 27 సెప్టెంబరు 2014 (17:31 IST)

పొడి చర్మం కోసం మామిడి మాస్క్ వేసుకోండి!

పొడి చర్మం కోసం మామిడి, అరటి, అవోకాడో మాస్క్‌లు సూపర్‌గా పనిచేస్తాయని బ్యూటీషన్లు అంటున్నారు. ఇందులో ముఖ్యంగా మామిడి మాస్క్‌తో పొడి చర్మం మీ సొంతం అవుతుంది. 
 
మామిడి మాస్క్ బాగా పండిన మామిడికాయను తీసుకోని తొక్క నుండి గుజ్జును వేరుచేయాలి. గుజ్జును మిక్సర్‌లో వేసి మెత్తగా చేయాలి. ఒక స్పూన్ మెత్తని గుజ్జులో ఒక స్పూన్ తెనే, మూడు స్పూన్స్ ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి గంట అయిన తర్వాత కడగాలి. అప్పుడు చర్మం తేమ, గ్లో వస్తుంది.
 
అలాగే అరటి మాస్క్ రెండు అరటి పండ్లను తీసుకోని తొక్క తీసి మిక్సర్‌లో వేసి మెత్తని గుజ్జుగా చేయాలి. దీనిని ముఖం మీద బాగా స్ప్రెడ్ చేసి ఒక గంట తర్వాత నీటితో శుభ్రం చేయాలి.
 
ఇక అవోకాడో మాస్క్ అవోకాడో నుండి తీసిన రసంలో పెరుగు కలపాలి. దీనికి ఒక స్పూన్ తేనే కూడా కలపాలి. దీనిని చర్మం పొడిగా ఉన్న ప్రాంతాలలో రాసి ఆరిన తర్వాత కడగిస్తే చర్మం కాంతివంతం అవుతుంది.