గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By CVR
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2015 (14:58 IST)

ఆరోగ్యానికే కాదు.. అందానికి ఆ 'టీ' మేలు..

సాధారణంగా పని ఒత్తిడితో నీరసం, కాస్త చిరాకు అనిపించినప్పుడు వేడి వేడి టీ తాగడం చాలా మందికి అలవాటే. అయితే కొన్ని రకాల టీలు ఆరోగ్యానికే కాదు, అందానికి బాగా ఉపకరిస్తాయి. అలాంటి టీలు తాగితే చర్మం తాజాగా ఆరోగ్యంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి అంతటి మేలుచేసే వైద్య గుణాలు ఉన్న ఆ టీలు ఏమిటో తెలుసుకుందాం.
 
గ్రీన్ టీ: ఈ టీ శరీరాన్ని అనారోగ్యాల బారి నుంచి కాపాడటమే కాదు. అద్భుతమైన సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. దీన్ని ముఖానికి ఫేస్ ప్యా‌క్‌లా కూడా వేసుకోవచ్చు. ఇది మృతకణాలని తొలగించి ముఖానికి మెరుపు తెస్తుంది. గ్రీన్ టీకి, నిమ్మరసం కలిపి జుట్టుని శుభ్రం చేసుకుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది.
 
అల్లం టీ : ఈ టీలో యాంటీసెప్టిక్‌ గుణాలెక్కువ. దీంతో చర్మం నల్లగా మారినా, పిగ్మెంటేషన్ బారిన పడినా ఈ టీని ముఖానికి రాసుకుంటే సరి. ఈ టీ డికాక్షన్‌ను తలకు పట్టించి కాసేపయ్యాక కడిగేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది.
 
బ్లాక్ టీ: ఈ టీ తయారుచేసుకుని చల్లారనివ్వాలి. తర్వాత ముఖానికి రాసుకుని సున్నితంగా మర్దన చేసుకోవాలి. పావుగంట తరవాత తడి ఆరిపోయాక కడిగేసుకుంటే సరి. ఈ టీ వృద్ధాప్య చాయలను కంట్లో చేస్తుంది.