శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (18:40 IST)

దానిమ్మ బ్యూటీ టిప్స్: దానిమ్మ రసం, బాదం నూనె..?

దానిమ్మ ఆరోగ్యానికే కాదు.. అందానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. దానిమ్మ గింజల్లో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. అవి అందాన్ని కాపాడటంలో కీలకంగా పనిచేస్తాయి. దానిమ్మ రసంలో చెంచా బాదం కలుపుకొని, ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోండి. ఇలా కొన్నాళ్లు చేస్తే ముఖంపై ముడతలు తగ్గుతాయి. 
 
మొటిమలతో కళ తప్పిన ముఖానికి దానిమ్మ రసం పరిష్కారం చూపిస్తుంది. దానికి చెంచా పటిక బెల్లం పొడి, చెంచా బాదం నూనె, అరచెంచా నారింజ తొక్కల పొడీ వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. అవసరం అనుకుంటే కాసిని పచ్చిపాలు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని రోజూ పూతలా వేసుకుంటే మొటిమలు తగ్గుముఖం పడతాయి. 
 
కాస్త రంగు తక్కువగా ఉన్నవారు దానిమ్మ గింజల రసంలో చెంచా తేనె కలిపి చర్మానికి రోజూ పూసుకుంటే పొడిబారిన చర్మానికి తేమ అందుతుంది. చర్మం ముడతలు పడింది అనుకున్నప్పుడు దానిమ్మ గింజల రసంలో చెంచా తేనె, చెంచా బాదం పొడి కలుపుకుని రోజూ పూతలా వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.