గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 18 మార్చి 2015 (18:38 IST)

మొటిమలు తగ్గాలంటే.. ఈ టిప్స్ పాటించండి

బియ్యం కడిగిన నీటిని మొటిమలపైన మృదువుగా రుద్దితే తగ్గిపోతాయి. మొటిమలు తగ్గాలంటే.. కస్తూరి పసుపును నిమ్మరసంతో కలిపి ఆ మిశ్రమాన్ని రాస్తే మొటిమలు తగ్గుతాయి.

చిటికెడు పసుపు ముఖానికి రాసి, కొద్దిసేపటి తర్వాత ముఖం కడుక్కోవడం ద్వారా మొటిమలను తగ్గించుకోవచ్చు. బయటకు వెళ్ళి వచ్చినప్పుడు, దుమ్ము చేరకుండా తప్పకుండా చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి.
 
మొటిమలు తగ్గిపోవాలంటే.. వేప ఆకులను నీళ్ళలో ఉడికించి, ఆ నీటిని బకెట్ నీళ్ళలో కలుపుకుని స్నానం చేస్తే ఎంతో మంచిది. ఇలా చేయడంవల్ల మొటిమలే కాదు అనేక రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయని బ్యూటీషన్లు అంటున్నారు.