శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 14 మార్చి 2015 (16:52 IST)

నిమ్మరసం, గ్లిజరిన్ రోజూ పెదవులకు రాస్తే ?

ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో 50 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ కలిపి నీరు చల్లబడేవరకు పాదాలు ఉంచితే పాదాలవాపు తగ్గిపోతుంది. ఒక టీ స్పూన్ నిమ్మరసం, రెండు మూడు చుక్కలు గ్లిజరిన్ కలిపి ప్రతిరోజూ పెదవులకు రాస్తే, నలుపు విరుగుతుంది. 
 
బేబీ ఆయిల్, ఆలివ్ ఆలివ్ రెండేసి స్పూన్లు చేర్చి బాగా మిక్స్ చేసుకుని ఒక బాటిల్‌లో భద్రపరుచుకోండి. ఈ నూనె మేకప్ రిమూవర్‌గా, మస్కారా, ఐలైనర్ రిమూవర్‌గా బాగా ఉపయోగపడుతుంది. పాదాల పగుళ్లకు నిద్రించేముందు ఆలివ్ ఆయిల్ రాత్రిపూట రాసుకుని, కాటన్ సాక్స్‌ ధరించుకోవాలి. 
 
ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు రాసుకుంటే పాదాల పగుళ్లకు చెక్ పెట్టుకోవచ్చు. అలాగే రోజూ చిన్నపాటి బీట్ రూట్ ముక్కను కట్ చేసి దానిని పెదాలపై రుద్దుకుంటే రోసీ లిప్స్ మీ సొంతం అవుతాయని, లిప్ స్టిక్స్ అవసరం లేదని బ్యూటీషన్లు అంటున్నారు.