మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : మంగళవారం, 10 నవంబరు 2015 (18:04 IST)

ఆయిల్ స్కిన్‌కు చెక్ పెట్టే కీరదోస-పెరుగు

ఆయిల్ స్కిన్‌కు చెక్ పెట్టాలంటే.. తాజా కీరదోసకాయను మెత్తగా తురుముకుని.. పెరుగుతో మిక్స్ చేసుకుని.. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. అలాగే ఒక చెంచా నిమ్మరసం, ఒక మింట్ టీ బ్యాగ్ తీసుకొని వేడి నీళ్ళలో వేసి మిక్స్ చేసి ఉడికించాలి. మొదట టీ బ్యాగ్‌ను వేడి నీళ్ళలో వేసి కొద్దిసేపు బాయిల్ చేయాలి.
 
టీబ్యాగ్‌ను తొలగించి తర్వాత నిమ్మరసాన్ని మిక్స్ చేసి నీటిని మరిగించాలి. మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి తర్వాత చల్లార్చి అందులో కాటన్ బాల్ డిప్ చేసి ముఖం, మెడను శుభ్రం చేసుకోవాలి. అలోవెర రసాన్ని పూర్తిగా తీసుకొని నేరుగా ముఖానికి అప్లై చేయాలి. ఇది గ్రేట్ టోనర్‌గా పనిచేస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు.