గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chitra
Last Updated : గురువారం, 28 జనవరి 2016 (11:57 IST)

పెరుగులో వెనిగర్‌ కలిపి రాసుకుంటే....

శరీరం మృదువుగా ఉండాలంటే మంచి బాడీ లోషన్‌ రాసుకోవాల్సిందే. అలాగని ఎంతో డబ్బులు ఖర్చుపెట్టి వాటిని కొనాల్సిన పని లేదు. ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఎలాంటే
 
రోజ్‌ వాటర్‌‌లో, ఒక స్పూను గ్లిజరిన్‌, రెండు టీ స్పూనుల నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని చిన్న సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టి అవసరమైనప్పుడు తీసి వాడుకుంటే చర్మం పొడి బారకుండా, మృదువుగా ఉంటుంది.
 
తులసి ఆకులను మెత్తగా చేసి అందులో కొంచెం పాలమీగడ, చిటికెడు పసుపు కలిపి రాత్రిపూట మోచేతులూ, మోకాళ్లకూ మర్దన చేసుకోవాలి. మర్నాడు చల్లటి నీళ్లతో శుభ్రపరచుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
 
నిమ్మచెక్కలతో మోచేతులకు మర్దన చేసుకోవాలి. ఇలా రెండు మూడు రోజులకోసారి చేస్తుంటే నలుపు క్రమంగా తగ్గిపోతుంది. అలానే తేనెలో పంచదార కలిపి నల్లగా ఉన్న చోట రుద్దుకోవాలి.
 
పెరుగులో వెనిగర్‌ కలిపి.. చేతులకు రాసుకోవాలి. తర్వాత గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయాలి. పులిసిన పెరుగు కూడా బాగా పని చేస్తుంది.
 
మూడు చెంచాల సెనగపిండిలో కాస్త పెరుగు కలిపి పూతలా వేసుకోవాలి. అరగంట తర్వాత చనీళ్లతో కడిగేసుకుంటే చర్మం కాంతిలీనుతుంది.