శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chitra
Last Updated : మంగళవారం, 24 మే 2016 (18:20 IST)

జుట్టు మృదువుగా ఉండాలంటే...? పెట్రోలియం జెల్లీ రాసుకుని పెర్‌ఫ్యూమ్‌‌ వేసుకుంటే?

చాలా మంది పెర్‌ఫ్యూమ్‌‌ని చర్మంపై నేరుగా కొట్టుకుంటారు. అలాకాకుండా ముందు పెట్రోలియం జెల్లీ రాసుకొని ఆ తర్వాత పెర్‌ఫ్యూమ్‌ కొట్టుకోవాలి. ఇలా చేయడంవల్ల ఆ పరిమళం చాలాసేపటి వరకు నిల్వఉంటుంది. 
 
యాపిల్‌ సీడర్‌ వెనిగర్‌ని హెయిర్‌ కండీషనర్‌లా వాడడం వల్ల జుట్టు చాలా మృదువుగా తయారవుతుంది. అలాగే జుట్టుపై ఉండే దుమ్ముధూళీ కూడా వదులుతుంది. 
 
మేకప్‌ రిమూవర్‌ లేనప్పుడు పెట్రోలియం జెల్లీ ద్వారా లిప్‌స్టిక్‌ తీసేయవచ్చు. పెదాలపై పెట్రోలియం జెల్లీ రాసుకొని టిష్యూతో తుడిచేస్తే సరిపోతుంది.

గోళ్ల రంగు వేసుకున్నాక ఐదునిమిషాలపాటు వేళ్లను చల్లని నీళ్లలో ఉంచాలి. ఇలా చేస్తే త్వరగా రంగు ఆరిపోతుంది. జుట్టుకి డై వేసుకునే సమయం లేనప్పుడు ఐషాడో ద్వారా తెల్ల జుట్టుని దాయవచ్చు. ఈ రంగు ఎక్కువసేపు నిలిచిఉంటుంది.