బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 10 నవంబరు 2016 (16:08 IST)

చల్లని పాలతో కాటన్‌ను ముంచి ముఖానికి అద్దితే.. టిప్స్ మీ కోసం..

చల్లని పాలతో కాటన్‌ను ముంచి ముఖానికి అద్దితే ముఖంపై గల మచ్చలు తొలగిపోతాయి. అలాగే కొబ్బరి నీరు కూడా ముఖానికి క్లెన్లింగ్‌లా ఉపయోగపడుతుంది. చందనం, లేత వేపాకును పేస్టులా రుబ్బుకుని ముఖానికి రాస్తే ముఖంపై

చల్లని పాలతో కాటన్‌ను ముంచి ముఖానికి అద్దితే ముఖంపై గల మచ్చలు తొలగిపోతాయి. అలాగే కొబ్బరి నీరు కూడా ముఖానికి క్లెన్లింగ్‌లా ఉపయోగపడుతుంది. చందనం, లేత వేపాకును పేస్టులా రుబ్బుకుని ముఖానికి రాస్తే ముఖంపై గల నల్లటి మచ్చలు తొలగిపోతాయి. అలాగే కీరదోస గింజలు పొడితో పాటు పెరుగు చేర్చి ముఖానికి రాసుకుంటే ఒకే నెలలో నల్లటి మచ్చలు దూరమవుతాయి. 
 
క్యాబేజీ ఆకుల పొడికి ఒక స్పూన్ తేనె కలిపి ముఖానికి రాసుకుని.. చేతులకు కాళ్లకు రాసుకుంటే సన్ టాన్‌ను తొలగించుకోవచ్చు. కొంచెం ఉల్లిరసం, రోజ్ వాటర్ అర టీ స్పూన్, ఆలివ్ ఆయిల్, సున్నిపిండిని కలిపి ముఖానికి మెడకు రాసుకుని మసాజ్ చేస్తే.. మెడపై గల నల్లాటి మచ్చలు తొలగిపోతాయి. పుచ్చకాయ గుజ్జు, పెసరపిండిని కలిపి ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖానికి ప్రత్యేక అందం చేకూరుతుందని బ్యూటీషన్లు అంటున్నారు.