Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బ్యూటీ టిప్స్.. పుదీనాతో ఫేస్ ప్యాక్ ఎలా..? (Video)

బుధవారం, 29 నవంబరు 2017 (13:34 IST)

Widgets Magazine

పసుపు, పుదీనా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తాజా పుదీనా ఆకులను మెత్తని పేస్టులా చేసి.. పసుపు అరస్పూన్ కలిపి.. ముఖానికి పూతలా వేసుకోవాలి. ప్యాక్ వేసేముందు గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆపై ఈ పేస్టుతో ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. సోయాబీన్‌ను మెత్తగా రుబ్బుకుని పచ్చిపాలను కలిపి ముఖానికి రాస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. 
 
ఇంకా నిమ్మ, తులసి ఆకుల రసం సమపాళ్ళలో కలిపి రోజూ రెండుసార్లు ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. శెనగపిండి, నెయ్యి, పసుపు కలిపి పేస్టులా తయారు చేసి చర్మంపై రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మృదువుగా గుండ్రంగా మసాజ్ చేయాలి ఇలా చేయడం ద్వారా పొడిబారిన చర్మంపై ఉన్న మురికి తొలగిపోతుంది. ప్రతిరోజూ చర్మానికి తేనె పూతగా రాయాలి... రోజూ ఈ టిప్స్ పాటిస్తే చర్మం తాజాగా వుంటుంది. 
 
కలబంద గుజ్జులో కొంచెం పసుపు, తేనె, మీగడతో పాటు గులాబీ రసం కలిపి మిశ్రమం చేసి.. ఆ పేస్టును ముఖానికి పూతలా వేసి పావు గంట తర్వాత కడిగేస్తే మచ్చలు, కాలిన గాయాలు, మొటిమల తాలూకు మచ్చలుపోతాయి. కలబంద గుజ్జులో కొంచెం గులాబీ రసం కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం తాజాగా వుంటుంది.

కలబంద గుజ్జులో కాస్త నిమ్మరసం కలిపి ముఖం, మెడ, చేతులపై రాసుకుంటే నలుపుదనం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

అమ్మాయిలూ బరువు తగ్గాలా.. అయితే ఇలా చేయండి...

చాలామంది అమ్మాయిలు ఊబకాయంతో పాటు అధిక బరువుతో బాధపడుతుంటారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, ...

news

జుట్టు రాలితే.. కోడిగుడ్డు, గ్రీన్ టీ తీసుకోండి.. (Video)

జుట్టు రాలిపోతున్నాయా? అయితే వెంటనే డైట్‌లో కోడిగుడ్డును, గ్రీన్ టీని తీసుకోవడం ...

news

పెరుగును రోజూ ఓ కప్పు తీసుకుంటే.. వయస్సు కనిపించదు..

పెరుగును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వయసు మీదపడినట్లు కనిపించరని ఆరోగ్య నిపుణులు ...

news

బాదంపప్పు, పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే?

మొటిమలు తగ్గాలంటే నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. నట్స్‌లో ఫ్యాటీ యాసిడ్లు, పీచు ...

Widgets Magazine