బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chitra
Last Updated : మంగళవారం, 7 జూన్ 2016 (15:47 IST)

బొప్పాయి ఆరోగ్యానికే కాదు.. అందానికీ మేలే.. బొప్పాయి గుజ్జులో తేనే, పాలు కలిపి?

బొప్పాయి పండు ఆరోగ్యానికే కాకుండా, అందానికి కూడా చాలా మేలు చేస్తుంది. దీనిలో లభించే విటమిన్లు నిర్జీవమైన చర్మాన్ని తొలగించి, కొత్త చర్మం ఏర్పడేందుకు సహకరిస్తుంది. బొప్పాయి పండుకు రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉండటంతో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇది చర్మానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం...
 
* పండిన బొప్పాయి పండుని గుజ్జులా చేసుకుని అందులో తేనె, పాలు కలిపి బాగా మిక్స్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది. 
 
* బొప్పాయి చూర్ణం తీసుకుని, అందులో ముల్తాన్‌ మట్టి, రోజ్‌ వాటర్‌ వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి ఆరిపోయాక చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఆయిలీ స్కిన్‌ వారికి ఈ ఫేస్‌ప్యాక్‌ బాగా ఉపయోగపడుతుంది. ముఖంపై ఉండే మొటిమలను కూడా అరికడుతుంది. 
 
* బొప్పాయి గుజ్జులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. ఇలా తరచుగా చేయటం వల్ల ముఖంపై ఉండే నల్లటి మచ్చలు తొలగిపోతాయి. గరుకు చర్మంతో ఇబ్బందిపడేవారికి బొప్పాయి పండు చక్కగా పనిచేస్తుంది. గరుకు చర్మాన్ని మృదువుగా మార్చే గుణం బొప్పాయికి మెండుగా ఉంది. 
 
* బొప్పాయి తొక్కలను ఓ గిన్నెలో వేసి ఉడికించి, వాటిని మెత్తగా నూరి ముఖానికి రాసి 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు లేదా మూడుసార్లు ఇలా చేసినట్లయితే ముఖం కోమలంగా మారుతుంది.