శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chitra
Last Updated : శుక్రవారం, 20 మే 2016 (16:46 IST)

చర్మ మృతకణాల తొలగింపునకు చక్కెరతో ట్రీట్మెంట్!

చర్మ సంరక్షణకు పంచదార ఎంతగానో ఉపయోగపడుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
 
తేనె, నిమ్మరసం సమానంగా తీసుకుని అందులో కాస్త చక్కెర వేసి.. బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి అప్లై చేసి మెల్లగా మసాజ్ చేయాలి. దీనివల్ల చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోయి చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది. 
 
ఆలివ్ నూనెను తీసుకుని దానిలో చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి పంచదార అణువులు కరిగే వరకు రుద్దితే మృత కణాలు తొలగిపోవడంతో పాటు చర్మం మృదువుగా, తేమగా ఉంటుంది.
 
చర్మ సౌందర్యంతో పాటు బాక్టీరియాను హరింపజేసే లక్షణం కూడా పంచదారకు ఉందని న్యూట్రీషియన్లు చెప్తున్నారు. గాయాలను మాన్పించడం, ఇన్ఫెక్షన్లను తొలగించటానికి పంచదార ఉపయోగపడుతుందని వారంటున్నారు. సాగిన చర్మాన్ని బిగుతుగా ఉంచే యాంటీ ఏజింగ్ క్రీముల్లో చక్కెరను వాడతారు. ముఖం మీద మచ్చలకు కూడా చక్కెరను వాడుతారని బ్యూటీషియన్లు చెప్తున్నారు.