శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (14:30 IST)

కొబ్బరి నూనెతో ముఖాన్ని మర్దన చేసుకుంటే?

ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కుని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ముఖానికి తేనెను రాసుకుని నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆరిపోయిన తరువాత గోరువెచ్చని నీటితోనే ముఖాన్ని కడుక్కోవాలి. కొబ్బరి నూ

ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కుని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ముఖానికి తేనెను రాసుకుని నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆరిపోయిన తరువాత గోరువెచ్చని నీటితోనే ముఖాన్ని కడుక్కోవాలి. కొబ్బరి నూనెలో దూదిని ముంచి ముఖాన్ని మర్దన చేసుకోవాలి. 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది.
 
పావుకప్పు పాలలో రెండు స్పూన్స్ చక్కెర వేసి కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అరటి పండు గుజ్జులో బొప్పాయి గుజ్జును కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది.