శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 6 జూన్ 2015 (19:14 IST)

నిమ్మరసంతో సన్ టాన్‌ను నివారించుకోండి.

నిమ్మరసం చర్మం మీద ఏర్పడ్డ సన్ టాన్(సూర్య రశ్మి వల్ల చర్మ రంగులో మార్పును) నివారిస్తుంది. ముఖ్యంగా సూర్యరశ్మికి కాళ్ళు, చేతులు నల్లగా మారుతాయి. నలుపు చర్మాన్ని నివారించుకోవాలంటే.. ఒక టీస్పూన్ బేకింగ్ సోడాలో రెండు చెంచాల నిమ్మరసం మిక్స్ చేసి పేస్ట్‌లా తయారుచేయాలి. దీన్ని సన్ టాన్‌కు గురైన ప్రదేశంలో అప్లై చేసి సాఫ్ట్ బ్రష్‌తో బ్రష్ చేసుకోవాలి.
 
అలాగే నిమ్మరసంను బాడీ వ్యాక్స్‌లో ఉపయోగించుకొన్నట్లైతే అరకప్పు షుగర్‌లో 1/4కప్పు నిమ్మరసం మిక్స్ చేసి మైక్రోవేవ్‌లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేడి చేయాలి. అవసరం అయినప్పుడు మధ్య మధ్యలో కలియబెడుతుండాలి. చల్లారిన తర్వాత కాళ్ళకు, చేతులకు అప్లై చేసి రిమూవ్ చేయడం వల్ల బాడీ వ్యాక్స్‌గా పనిచేస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు.