బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (16:11 IST)

చర్మం పొడిబారినట్లు నిర్జీవంగా కనిపిస్తే..

చర్మం పొడిబారినట్లు నిర్జీవంగా కనిపిస్తే.. చెంచా గంధం పొడి, టేబుల్ స్పూన్ గులాబీ రేకుల ముద్ద, చెంచా బాదం నూనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం తేమగా తాజాగా కనిపిస్తుంది. ముఖంపై ఉండే నల్లదనమూ తగ్గుతుంది. 
 
అలాగే పాదాల పగుళ్లు వేధిస్తే.. గంధం దివ్యౌషధంగా పనిచేస్తుంది. దీనిలో పగుళ్లను తగ్గించే యాంటీ మైక్రోబయల్ గుణాలుంటాయి. గంధంలో కొబ్బరినూనె కలిపి దాన్ని పాదాలూ మడమల దగ్గర పూతలా పూయాలి. అరగంటాగి  కాసేపు గోరువెచ్చని నీళ్లలో పాదాలను ఉంచి ఆపై శుభ్రపరుచుకుంటే సరి. ఇలా రోజు విడిచిరోజూ చేస్తే పగుళ్లు తగ్గుతాయి.