శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chj
Last Modified: గురువారం, 2 మార్చి 2017 (23:17 IST)

సౌందర్యాన్ని వికసింపచేసే నెయ్యి

నిద్రలేమితో బాధపడేవారి కళ్ల క్రింద నల్లటి చారలు ఏర్పడుతుంటాయి. దాని వల్ల ముఖం చాలా నిస్సత్తువగా కనిపిస్తుంది. ఈ నల్ల చారలు పోవాలంటే రాత్రి పడుకునే ముందు రెండు, మూడు చుక్కల నెయ్యిని కళ్ల క్రింద మర్దనా చేసి, మరుసటి రోజు ఉదయం ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

నిద్రలేమితో బాధపడేవారి కళ్ల క్రింద నల్లటి చారలు ఏర్పడుతుంటాయి. దాని వల్ల ముఖం చాలా నిస్సత్తువగా కనిపిస్తుంది. ఈ నల్ల చారలు పోవాలంటే రాత్రి పడుకునే ముందు రెండు, మూడు చుక్కల నెయ్యిని కళ్ల క్రింద మర్దనా చేసి, మరుసటి రోజు ఉదయం ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజు చేస్తే తప్పక ఫలితం లభిస్తుంది. 
 
నీళ్లు, నెయ్యి మిశ్రమంతో చర్మానికి మర్ధనా చేస్తే చర్మ నిగారింపు పెరుగుతుంది. నెయ్యి పెదాలకు రాసుకుంటే చలి కాలం, వేసవి కాలంలో పెదవులు పొడిబారి పోకుండా ఉంటాయి. నెయ్యి, పాలు, మసూర్ దాల్ పౌడర్లను బాగా కలియబెట్టి, అందులోకి శనగ పిండి కొద్దిగా వేసి మెత్తగా తయారు చేసిన ఫేస్ ప్యాక్ మిశ్రమాన్ని ముఖానికి కాసుకొని ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మెరిసిపోతుంది.